Nellore: ఏపీకి చంద్రబాబే శ్రీరామరక్ష.. వక్ఫ్ బోర్డ్ చైర్మన్!

Nellore: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

V. Narasimhulu, Nellore
Published on: 20 April 2026 6:59 PM IST
Nellore
X

Nellore: ఏపీకి చంద్రబాబే శ్రీరామరక్ష.. వక్ఫ్ బోర్డ్ చైర్మన్!

Nellore: నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెట్ శివప్రసాద్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు.

అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ..

తమ ప్రియతమ నాయకులు, టిడిపి జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. భారతదేశవ్యాప్తంగా తెలుగుజాతికి గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అయితే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు.

అటువంటి మిషనరీ నాయకుడి వద్ద పనిచేయటం తమ అదృష్టమని అన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు చరిష్మా వల్లే ఆంధ్ర రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులు పారిపోయారని సంక్షేమం అభివృద్ధిని సమతుల్యంగా పాటిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.

మారుతున్న తరాలకు అనుగుణంగా ఏఐ ను తీసుకువచ్చారని క్వాంటం కంప్యూటర్స్ ను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారని తెలిపారు. ఇటువంటి మహా నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి ఉండటం మన అదృష్టం అని చంద్రబాబు నాయుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ..

భారతదేశంలోనే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని, ఆయనకున్న తెలివితేటలు విజన్ మరే నాయకుడికి లేవని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని నిలబెడుతూ రాష్ట్రం గర్వపడే విధంగా పాలన నిర్వహిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు గురించి చెప్పాలంటే 24 గంటల సమయం పడుతుందని అటువంటి నాయకుడి వద్ద పని చేయటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆయన నాయకత్వంలో ఒక సైనికుడిలా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు జెన్నీ రమణయ్య, పనబాక భూలక్ష్మి, చంచల బాబు యాదవ్, పెంచల్ నాయుడు,

ఊరందూరు సురేంద్రబాబు, కనపర్తి గంగాధర్, ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, ధర్మవరపు సుబ్బారావు, పిట్టి సత్య నాగేశ్వర రావు, పీ ఎల్ రావు, నన్నేసాహెబ్, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, కువ్వారపు బాలాజీ, రసూల్, హయత్ బాబా, పముజుల ప్రదీప్, దారా మల్లి తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story