Nellore: నెల్లూరులో ప్రభుత్వ ఖాజీ ముస్తాక్ నూతన కార్యాలయం ప్రారంభం!
Nellore: నెల్లూరులో ప్రభుత్వ ఖాజీ నూతన కార్యాలయం ప్రారంభం.. కుటుంబాలను నిలబెట్టడమే ఖాజీల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేసిన ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్.
Nellore: నెల్లూరులో ప్రభుత్వ ఖాజీ ముస్తాక్ నూతన కార్యాలయం ప్రారంభం!
Nellore: కుటుంబాల్లో చిన్నచిన్న విభేదాలు వచ్చిన వెంటనే విడాకుల వైపు వెళ్లడం సరికాదని, సాధ్యమైనంత వరకు కుటుంబ బంధాలను కాపాడేందుకు ఖాజీలు కృషి చేయాలని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరులో ప్రభుత్వ ఖాజీ ముస్తాక్ నూతన కార్యాలయాన్ని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు.
ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఖాజీ బాధ్యత కేవలం సంతకం చేయడం కాదని, రెండు జీవితాలు, రెండు కుటుంబాలు విడిపోకుండా సయోధ్యకు ప్రయత్నించడమే ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. విడాకులు చివరి మార్గంగా మాత్రమే ఉండాలని, భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తితే ముందుగా కుటుంబ పెద్దలు, సమాజ పెద్దలు కూర్చొని పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించారు.
ఇప్పుడే విడాకులు ఇవ్వాలి అంటూ ఖాజీలపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. మతపరమైన విధానం, ప్రక్రియను గౌరవించాలి అని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా కొత్తగా వివాహమైన దంపతులు చిన్న అపార్థాలకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమస్య పరిష్కారానికి సమయం ఇవ్వాలని కోరారు.
నెల్లూరులో ఖాజీ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్న ఖాజీ ముస్తాక్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో నన్నే సాహెబ్, మైనుద్దీన్, సాబీర్ ఖాన్, రియాజ్, ఇంతియాజ్, హయత్ బాబా, నౌషాద్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.




