Nellore: కేవలం విద్యతోనే సమాజంలో సమానత్వం, గౌరవం సాధ్యం.. అబ్దుల్ అజీజ్!
Nellore: నెల్లూరు వక్ఫ్ భూమిలో రూ.20 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మిస్తున్న ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్’ పనులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పరిశీలించారు.
Nellore: కేవలం విద్యతోనే సమాజంలో సమానత్వం, గౌరవం సాధ్యం.. అబ్దుల్ అజీజ్!
Nellore: నెల్లూరు పరమేశ్వరి నగర్ నందు గల వక్ఫ్ భూమి నందు నిర్మిస్తున్న, "డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్" నిర్మాణ పనులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు, వక్ఫ్ సీఈఓ పరిశీలించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ..
రూ. 20 కోట్లు సిఎస్ఆర్ నిధులతో కార్పొరేట్ స్థాయి స్కూల్ ను నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాదికి అందుబాటులోకి తేవాలని శరవేగంగా, పనులు జరుగుతున్నాయని తెలిపారు. తనకు అన్ని జిల్లాల నుంచి స్థలాలు కేటాయించాలని ఫోన్లు చేస్తున్నారని స్థలాలు కేటాయిస్తే తాము కూడా స్కూళ్లు నిర్మిస్తామని ముందుకు వస్తున్నారు అని అన్నారు. తాలేం ఏ హునర్ తో 250 మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని,
కేవలం చదువుతూనే సమానత్వం గౌరవం దొరుకుతాయని అన్నారు. వక్ఫ్ భూములు నిరుపయోగంగా ఉంటే ఆక్రమణకు గురవుతున్నాయని, ఆస్తులను నిరుపయోగంగా ఉంచకుండా ఉపయోగంలోకి తీసుకుని వచ్చి ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు. స్కూల్ నిర్మాణానికి సహకరించిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలిపారు.
"కృష్ణ చైతన్య విద్యాసంస్థల వివాదం పై స్పందించిన అబ్దుల్ అజీజ్"
నెల్లూరులో ఉన్న కాలేజీలు మాత్రమే రైడ్ చేయలేదని, వెడత వారం భీమవరంలో నారాయణ కాలేజీని కూడా రైడ్ చేశారని అన్నారు. రూల్స్ పాటిస్తే అంత భయం ఎందుకని అన్నారు. మంత్రి నారాయణ స్వభావం కక్ష సాధింపులు చేసే స్వభావం కాదని, కక్ష సాధింపులు చేస్తూ మీరెవరు వ్యాపారాలు చేయలేరని హెచ్చరించారు. ప్రతిపక్షంలో మమ్మల్ని ఎందుకు కష్టాలు పెట్టారని అన్నారు. ప్రతి విషయంలో నేను ఉన్నాను ముందుకు వచ్చినప్పుడు మిస్టర్ క్లీన్ గా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ పై రాజకీయ బురద వేయొద్దని, మీ పై ఉన్న బురద కడుక్కోవాలని అన్నారు.
"ఏఎస్ పేట దర్గా విషయం పై స్పందిస్తూ..."
ఎస్ పేట సజ్జాద హఫీజ్ పాషా బోర్డుకు వ్యతిరేకంగా 32 కేసులు వేశారని అన్నారు. సజ్జాద పనులు సరిగ్గా చేయడం లేదని అతనికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. గతంలోనే అతనిని మతవల్లిగా తొలగించామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆలోచనే తమ ఆలోచన కూడా అని వివరించారు. ఎంక్వయిరీ పూర్తికాకుండా చర్యలు బహిర్గతం చేయలేమని, వెరీ పూర్తయ్యాక అతని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారు.
కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సభ్యులు అక్రమ్, ఖాజా, ఇస్మాయిల్ బేగ్, బెపారి జాకీర్ అహ్మద్ సీఈవో యాకూబ్ ఖాజీ తదితరులు పాల్గొన్నారు.




