Nellore: వక్ఫ్ బోర్డు హాల్ టికెట్.. విద్యార్థుల భవిష్యత్తుకు వీసా
Nellore: ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న "తాలీం ఏ హునర్" టాలెంట్ టెస్ట్ ఏర్పాట్లను నెల్లూరు నగరంలోని పిఎన్ఎం స్కూల్‌లో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు.
Nellore: వక్ఫ్ బోర్డు హాల్ టికెట్.. విద్యార్థుల భవిష్యత్తుకు వీసా
Nellore: ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న "తాలీం ఏ హునర్" టాలెంట్ టెస్ట్ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని పిఎన్ఎం స్కూల్ లో ఏర్పాట్లను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు టాలెంట్ టెస్ట్ జరగనుందని తెలిపారు.
నెల్లూరులో వి ఆర్ సి హై స్కూల్, పిఎన్ఎం గర్ల్స్ హై స్కూల్, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించామని పరీక్షను చాలా పకడ్బందీగా నిర్వహించనున్నారని , చేపట్టవలసిన విధి విధానాలు అన్ని అమలు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హాల్ టికెట్ మనకు కాగితంలా కనపడుతుందని వారికి మాత్రం వారి భవిష్యత్తుకు ఒక వీసా లా కనపడుతుందని అన్నారు.
విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని వివరించారు. విద్యార్థులు ఎవరూ భయభ్రాంతులకు గురికాకుండా ధైర్యంగా ఎగ్జామ్ రాయాలని కోరారు. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




