Nellore: మైపాడు రోడ్డు డివైడర్లలో డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ పరిశీలన

Nellore: నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఆహ్లాదకరమైన పర్యాటక మరియు వినోద సదుపాయాలను మరింత చేరువ చేసేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

V. Narasimhulu, Nellore
Published on: 12 Jun 2026 7:16 PM IST
Nellore
X

Nellore: మైపాడు రోడ్డు డివైడర్లలో డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ పరిశీలన

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో... పర్యాటక మరియు వినోద సదుపాయాల అభివృద్ధి అవకాశాలను, పరిశీలించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (APGBC) మేనేజింగ్ డైరెక్టర్ ఎం.కె.వి. శ్రీనివాసులు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ (ADH) నరసింహారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనిల్ కుమార్ (EE), అసిస్టెంట్ ఇంజినీర్లు (AEs)తో కలిసి చిల్డ్రన్స్ పార్క్ మరియు బోడిగాడితోట పార్కులను శుక్రవారం సందర్శించారు.

ఈ సందర్భంగా రెండు పార్కుల్లో వాటర్ స్పోర్ట్స్, అమ్యూజ్‌మెంట్ కార్యకలాపాలు, జిప్ లైనర్ ఏర్పాటు వంటి వినోద సౌకర్యాల అభివృద్ధికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

అనంతరం మైపాడు రోడ్ డివైడర్లలో ఇటీవల ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను పరిశీలించి, మొక్కల నిర్వహణ, సంరక్షణ మరియు నీటి వినియోగాన్ని మరింత సమర్థవంతంగా చేపట్టేలా తగిన సూచనలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో APGBC చీఫ్ ఆర్కిటెక్ట్ సత్యనారాయణ, హార్టికల్చర్ అధికారి సాయి నరసింహ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story