Beeda Masthan Rao: ఫిష్‌మీల్ లభ్యతపై ఢిల్లీలో భేటీ.. కేంద్రానికి ఎస్‌ఎఫ్‌ఎంఏ వినతి!

Beeda Masthan Rao: దేశీయ ఆక్వా రంగానికి ఫిష్‌మీల్ లభ్యత, దాణా ధరల నియంత్రణపై న్యూఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖతో బీద మస్తాన్ రావు, అల్లూరి ఇంద్రకుమార్ కీలక సమావేశం నిర్వహించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 6 Oct 2026 11:55 PM IST
Beeda Masthan Rao
X

Beeda Masthan Rao: ఫిష్‌మీల్ లభ్యతపై ఢిల్లీలో భేటీ.. కేంద్రానికి ఎస్‌ఎఫ్‌ఎంఏ వినతి!

Beeda Masthan Rao: ఆక్వాకల్చర్ రంగానికి అవసరమైన ఫిష్‌మీల్ దేశీయంగా తగినంతగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం, పెరుగుతున్న ధరలను నియంత్రించడం, రైతులు మరియు రొయ్యల దాణా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో Shrimp Feed Manufacturers Association (SFMA) తరపున బీద మస్తాన్ రావు యాదవ్, ఎంపీ, రాజ్యసభ మరియు చైర్మన్, BMR Group మరియు అల్లూరి ఇంద్రకుమార్, చైర్మన్, Avanthi Group పాల్గొన్నారు.

దేశంలో ఉత్పత్తి అవుతున్న ఫిష్‌మీల్‌లో 85 శాతానికి పైగా ఎగుమతి అవుతుండటంతో దేశీయ ఫీడ్ పరిశ్రమకు లభ్యత తగ్గి, ధరలు భారీగా పెరుగుతున్నాయని SFMA ప్రతినిధులు వివరించారు. ఫిష్‌మీల్ ధరల పెరుగుదల నేరుగా ఫీడ్ తయారీ వ్యయాన్ని, తద్వారా రొయ్యల రైతుల సాగు వ్యయాన్ని పెంచుతూ వారి లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముడిసరుకు ధరల పెరుగుదల ఫీడ్ తయారీదారుల ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా పెంచిందని కేంద్రానికి నివేదించింది.

దేశీయ ఆక్వాఫీడ్ పరిశ్రమకు ప్రాధాన్యతతో ఫిష్‌మీల్ సరఫరా అవసరమైనప్పుడు ఎగుమతులపై తాత్కాలిక నియంత్రణ/కోటా విధానం, ధరలు–సరఫరాపై పర్యవేక్షణ వంటి తక్షణ విధానపరమైన చర్యలు తీసుకోవాలని SFMA ప్రతినిధులు కోరారు.

రైతుల ప్రయోజనాలను కాపాడుతూ ఫీడ్ ధరలను అందుబాటులో ఉంచేందుకు, దేశీయ ఆక్వాకల్చర్ రంగం మరియు సుమారు USD 5 బిలియన్ విలువైన రొయ్యల ఎగుమతి రంగం పోటీతత్వాన్ని పరిరక్షించేందుకు ఫిష్‌మీల్ దేశీయ లభ్యతను నిర్ధారించడం అత్యవసరమని బీద మస్తాన్ రావు యాదవ్ మరియు శ్రీ అల్లూరి ఇంద్రకుమార్ స్పష్టం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE