AS Peta: ఎస్సీ కాంప్లెక్స్ భూములను కాపాడాలి ఏఎస్ పేట దళిత నేతలు
AS Peta: ఏఎస్ పేటలో ఎస్సీ కాంప్లెక్స్ గదులు, భూమిని ఆక్రమణల నుండి కాపాడాలని తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐలకు వినతిపత్రం ఇచ్చిన దళిత సంఘాల నాయకులు.
AS Peta: ఎస్సీ కాంప్లెక్స్ భూములను కాపాడాలి ఏఎస్ పేట దళిత నేతలు
ఏఎస్ పేట: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు దక్షిణ వైపు ఉన్న ఎస్సీ దళిత ప్రజల దళిత నిరుద్యోగుల అభివృద్ధికి ఏర్పాటుచేసిన ఎస్సీ కాంప్లెక్స్ రూములను దాని వెనక ఉండే ఖాళీ భూమిని పరిరక్షించాలి అని సోమవారం దళిత సంఘాల నేతలు ఏ ఎస్ పేట మండల తాసిల్దార్ వెంకటేశ్వర్లు మరియు ఎస్ పేట మండల అభివృద్ధి అధికారి ప్రసన్న కుమారి మరియు ఏ ఎస్ పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ జిలాని లను మండల అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఎస్పేట మండలంలో గత 30 సంవత్సరాలు కిందట మండలంలోని ఎస్సి దళిత నిరుద్యోగ యువతీ యువకులకు ఏదైనా షాపులను నిర్వహించుకునేందుకు అనుకూలంగా కొన్ని రూములు ఏర్పాటు చేశారు కానీ ఆ రూములకు అప్పట్లో అన్ని సౌకర్యాలు కల్పించలేదు.
దాంతో ఆ రూములను వినియోగించుకునేందుకు ఆ దళిత యువతీ యువకులు ముందుకు రాలేదు అయితే ఇప్పటికి కూడా ఆ షాపింగ్ కాంప్లెక్స్ రూములు నిరుపయోగంగా మారిపోయాయి ఆ రూములు చుట్టూ కంపకర్ చెట్లు ముళ్ల పొదలతో అల్లుకుపోయాయి అయితే ఇటీవల కొందరు రాజకీయ నాయకుల అండదండలతో ఆ ఎస్ సి కాంప్లెక్స్ భూములను ఆక్రమించుకోవాలని కొందరు చూస్తున్నారని మండలంలో చర్చ కొనసాగుతుంది.
దీంతో ఆ వ్యవహారం ఎస్సీ నాయకులకు చేరడంతో వారు వెంటనే స్పందించి వారి వారి సంఘ నాయకులతో చర్చించి దానిపై మండలంలోని ప్రధాన ముగ్గురు అధికారులకు అలాగే జిల్లా కలెక్టర్ కి అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ కి అలాగే డిఆర్డిఏ ప్రాజెక్ట్ అధికారికి అలాగే ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గారికి ఈ వినతి పత్రం ను సమర్పిస్తున్నామని వారు తెలిపారు.
ఈసారైనా జిల్లా అధికారులు మండల అధికారులు అందరూ కలిసి మండలంలోని ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆ ఎస్సీ కాంప్లెక్స్ రూములు ఉపయోగపడే విధంగా చేయాలని మిగిలిన స్థలంలో కూడా కొత్తగా కొన్ని కాంప్లెక్స్ రూములు ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని వినియోగంలోకి తేవాలని వారు అధికారులు కోరారు అలాగే ఆ స్థలంలో ఈ స్థలం ప్రభుత్వ స్థలం ఎస్సీ కార్పొరేషన్ స్థలమని బోర్డు వేయించి పెట్టాలని అధికారులు వాళ్ళు కోరారు.
అలాగే ఆ స్థలంలో ఉండే మురుగునీరుని బయటికి పంపించి ఆ స్థలంలో మట్టి తోలించి ఆ స్థలాన్ని సదువు చేసి ఉపయోగం లోకి తేవాలని వారు అధికారులు కోరారు అలాగే ఆ స్థలంలో ఎటువంటి ఎవరైనా దురాక్రమన చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వారు ఎటువంటి నాయకులైన ఎటువంటి వారైనా సరే పేదల భూముల జోలికి వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని అనే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు ఎం హరికృష్ణ ఎం ఎస్ ఎస్ నాయకురాలు గంగ పట్ల లచ్చమ్మ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం రాఘవేంద్ర సురేష్ ఉదయ్ అశోక్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు




