Nellore: ఏఎస్ పేట దర్గా వద్ద పారిశుధ్య లోపం.. స్థానికుల తీవ్ర ఆగ్రహం

Nellore: ప్రసిద్ధ ఖాజా నాయబ్ దర్గాకు శుక్రవారం వేలాదిగా తరలివచ్చిన యాత్రికులు నడిరోడ్డుపై పారుతున్న మురికి నీటిని తొక్కుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 5 Jun 2026 7:01 PM IST
Nellore
X

Nellore: ఏఎస్ పేట దర్గా వద్ద పారిశుధ్య లోపం.. స్థానికుల తీవ్ర ఆగ్రహం

Nellore: నేడు శుక్రవారం కావడంతో వేలాదిమంది యాత్రికులు నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ వారి దర్గాకు తరలివచ్చారు. దర్గాకు వెళ్లే యాత్రికులు మురికి నీరు తొక్కుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో యాత్రికులు స్థానికులు అధికారుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీకి వేసిన పైపులు పాత పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బ్లాక్ అయినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్న అటువైపు పంచాయతీ కార్యదర్శి గాని ప్రత్యేక అధికారి గాని కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని ఆరోపిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి యాత్రికుల బాధలు తొలగించాలి అని కోరుతున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story