AS Peta: జమ్మవరంలో నిర్వీర్యంగా సచివాలయ వ్యవస్థ

AS Peta: నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట (ఏఎస్ పేట) మండలంలోని జమ్మవరం గ్రామ సచివాలయంలో సిబ్బంది కొరత కారణంగా సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 16 Jun 2026 3:23 PM IST
AS Peta
X

AS Peta: జమ్మవరంలో నిర్వీర్యంగా సచివాలయ వ్యవస్థ

AS Peta: అనుమసముద్రంపేట మండలంలోని జమ్మవరం గ్రామ సచివాలయంలో ఎప్పుడు వెళ్లినా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వ్యవసాయ అధికారి, పశుసంవర్ధ శాఖకు ఒకరు మొత్తం నలుగురు విధులు నిర్వహిస్తున్నారని,

ఓటర్ల జాబితా ఎస్ ఐ ఆర్ పని మరియు ఇతర పనులపై పలువురు వెళుతూ ఉన్నారని జమ్మవరంలో సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని, ఉన్నటువంటి అరకొర సిబ్బంది అన్ని విధులను నిర్వహిస్తూ ఉండడం వల్ల ప్రజల సమస్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పలువురు పత్రికాముఖంగా వాపోయారు. దీనిపట్ల అధికారులు స్పందించి ఖాళీలను భర్తీ చేయాలని కోరుకుంటున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story