Nellore: నర్రవాడలో వెంగమాంబ తల్లికి ఆషాఢ సారే సంబరాలు..

Nellore: నెల్లూరు జిల్లా నర్రవాడ శ్రీ వెంగమాంబ తల్లి ఆలయంలో ఆషాఢ మాస సారే కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయగిరి పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 30 July 2026 8:17 PM IST
Nellore
X

Nellore: నర్రవాడలో వెంగమాంబ తల్లికి ఆషాఢ సారే సంబరాలు..

నెల్లూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో కొలువై ఉన్న శ్రీ వెంగమాంబ తల్లికి ఆషాఢ మాస సారే కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయగిరి మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు పసుపు, కుంకుమ, పట్టుచీరలు, సారే సామగ్రిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సారే కార్యక్రమంలో మహిళలు, యువతులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి పారవశ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పులు, మేళతాళాల నడుమ సారేను ఆలయానికి తీసుకువచ్చిన భక్తులు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు సమర్పించారు.

ఇటీవలే అమ్మవారి దివ్య కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించబడిన నేపథ్యంలో, ఆ ఆనవాయితీ ప్రకారం ఆషాఢ మాస సారేను సమర్పించడం ప్రత్యేకతగా నిలిచింది. అనంతరం భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామస్మరణలు, భక్తుల జైజై ధ్వనులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story