Atmakur: ఆత్మకూరుకు స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు 2026

Atmakur: పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతిభకు గాను నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు స్వచ్ఛ మున్సిపాలిటీ 2026 అవార్డు దక్కింది; కలెక్టర్ చేతుల మీదుగా పురస్కార ప్రదానం.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 5 Oct 2026 7:23 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరుకు స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు 2026

ఆత్మకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛత పరిశుభ్రత పరిపాలన విభాగంలో అందించే స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డుకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఎంపికైంది.. ఈ సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా స్వచ్ఛ మున్సిపాలిటీ 2026 అవార్డును ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగ ప్రసాద్ అందుకున్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ను జిల్లా కలెక్టర్ అభినందిస్తూ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని తెలిపారు.. ఈ అవార్డుతోపాటు బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ గా తుపాకుల ప్రసాద్,చిచ్చు ఈశ్వరయ్య లు స్వచ్ఛ ఎస్‌ఎల్‌ఎఫ్ గా పంటవీధి ఎస్‌ఎల్‌ఎఫ్ ఎంపికయ్యారు.

ఆత్మకూరుకు స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు రావడం పై ఆత్మకూరు మున్సిపాలిటీలోని గ్రామస్తులు అధికారులు మున్సిపల్ కమిషనర్ ను వారి సిబ్బందిని అభినందించారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)