Atmakur: ఆత్మకూరులో తాగునీటి కష్టాలు!
Atmakur: ఆత్మకూరు తాగునీటి పైపుల లీకేజీలపై అఖిలపక్ష విచారణ జరపాలని సీపీఎం డిమాండ్. మరమ్మతుల నిధుల దుర్వినియోగంపై మాజీ వైస్ చైర్మన్ సంధాని ఆరోపణలు.
Atmakur: ఆత్మకూరులో తాగునీటి కష్టాలు!
Atmakur: సోమశిల జలాశయం నుండి ఆత్మకూరు పట్టణానికి తాగునీటిని అందించే పైపులు లీకేజీలపై అఖిలపక్ష పరిశీలన జరపాలని, ఈ లీకేజీల మరమ్మత్తుల వ్యయం పై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఆత్మకూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సంధాని, ఆత్మకూరు పట్టణ సిపిఎం కార్యదర్శి కే.డేవిడ్ రాజు, ఆత్మకూరు సిపిఎం నాయకులు నాగయ్య లు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ షేక్ సంధాని ఆత్మకూరు పట్టణంలో పది రోజులుగా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రహించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కోసం తాము ఆత్మకూరు నుండి సోమశిల వరకు తాగునీటి పైపులు పరిశీలన చేశామని, 11 చోట్ల లీకేజీలు ఉన్నాయంటూ ఫోటోలను కూడా ప్రదర్శించారు.
ఈ లీకేజీలతో ఆత్మకూరు పట్టణ ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందకపోగా లీకేజీలవుతున్న గ్రామాల వద్ద ప్రజలు నీటిమడుగులతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో స్థానిక శాసనసభ్యులుగా,రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు పట్టణ ప్రజలకు సమృద్ధిగా త్రాగునీరు అందించాలన్న లక్ష్యంగా 75 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి బృహత్తర త్రాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ పథకం ద్వారా లక్ష మందికి సరిపడా త్రాగునీరు అందించే అవకాశం ఉందని, అయితే ఆత్మకూరు పట్టణంలో ఉన్న 33 వేల మంది ప్రజలకు సక్రమంగా నిరందించే పరిస్థితి లేకుండా అధికారులు నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆనం రామనారాయణ రెడ్డి ముందు చూపుగా డెడ్ స్టోరేజీ ఉన్నా గాని త్రాగునీరు అందించేలా ప్రత్యేక పంపు ఏర్పాటు చేయించారన్నారు.
కాని రెండు మూడు ఏళ్లుగా సోమశిల నుండి ఆత్మకూరు వరకు నీరు అందించే పైపులు లీకేజీలఏర్పడినా అధికారులు సక్రమంగా వర్ణించుకోలేదని, ఇటీవల రేవూరు వద్ద పైపు పగిలిపోవడంతో హడావుడి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.అన్ని లీకేజీల విషయమై అఖిలపక్షంతో పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. లేకేజీల మరమ్మత్తులు అంటూ గత సంవత్సరం 25 లక్షల రూపాయలను ఖర్చు చేసేలా బడ్జెట్లో నిర్ణయించారని, అంతకుముందు సంవత్సరం కూడా అదే మాదిరి 25 లక్షల ఖర్చు చేసాలా నిర్ణయించారని, ఈ విధంగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ విషయం విచారణ జరపాల్సిన అవసరం ఉందని నందాని పేర్కొన్నారు.
డేవిడ్ రాజు మాట్లాడుతూ పది రోజులుగా పట్టణ ప్రజలు త్రాగునీటికి అలమటిస్తున్నందున తాము సోమశిల ,వరకు పరిశీలించామని, అధికారుల నిర్లక్ష్యం అడుగడుగున కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. లీకేజీల నివారణకు ఒక ఏజెన్సీ కి బాధ్యత అప్పగించి.చేయించాల్సిన అవసరం ఉందన్నారు. మరమ్మతుల పేరుతో నిధులు దుర్వినియోగమైనట్లుగా మేము భావిస్తున్నామని, విచారణ జరపాల్సిన
అవసరం ఉందని లేదంటే తామే ప్రజలను చైతన్యవంతులు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది. తీవ్రంగా ఉన్నా ఆదానీ కొళాయిలకు మాత్రం నీరు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గమనించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పట్టణ ప్రజలకు సమృద్ధిగా నీరందించే చర్యలు చేపట్టాలని లేకుంటే వెంటనే తాము ప్రజాందోళనకు దిగుతామని హెచ్చరించారు.




