Nellore: ఏఎస్‌పేట దర్గా 253వ గంధమహోత్సవం భద్రతపై డీఎస్పీ సమీక్ష!

Nellore: ఏఎస్‌పేట శ్రీ ఖాజా నాయబ్ రసూల్ వారి 253వ గంధమహోత్సవం సందర్భంగా ఆత్మకూరు డీఎస్పీ టి. వెంకటేశ్వర్లు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 4 Sept 2026 11:03 AM IST
Nellore
X

Nellore: ఏఎస్‌పేట దర్గా 253వ గంధమహోత్సవం భద్రతపై డీఎస్పీ సమీక్ష!

Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్‌ పేటలోని శ్రీ ఖాజా నాయబ్ రసూల్ వారి 253వ గంధమహోత్సవం ఈ నెల 8న నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆత్మకూరు డీఎస్పీ టి. వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన గురువారం ఏఎస్‌పేట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎస్సై షేక్‌ జిలాని, సిబ్బందితో ఫాల్‌ఇన్‌ నిర్వహించి విధులపై సమీక్షించారు.అనంతరం ప్రసిద్ధ శ్రీ ఖాజా నాయబ్‌ రసూల్‌, హబీబా అమ్మాజానుల దర్గాను సందర్శించి గంధ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. దర్గా ఈవో షేక్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌తో సమావేశమై వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తుల రద్దీ, బందోబస్తు, పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. దర్గా పరిసరాలతో పాటు ఏఎస్‌పేట గ్రామంలోనూ భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు.

దర్గా నిర్వాహకులు, పంచాయతీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఎస్పీ సూచించారు. మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story