Sangam: సంగం బ్యారేజీ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!

Sangam: సంగం బ్యారేజ్ వద్ద మూడో రోజు వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు. నిమజ్జన ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 14 Sept 2026 5:37 PM IST
Sangam
X

Sangam: సంగం బ్యారేజీ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!

Sangam: నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీని ఆత్మకూరు డిఎస్పీ వెంకటేశ్వర్లు,సంగం సీఐ శ్రీనివాస రెడ్డి,ఎస్సై భోజ్యా నాయక్ తో కలిసి సందర్శించారు.మూడో రోజు వినాయక నిమజ్జనాలు జరగనున్న నేపథ్యం లో బ్యారేజీ వద్ద నిమజ్జనానికి సంబంధించి వసతులను పరిశీలించారు.బ్యారేజి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వినాయక నిమజ్జనాలు నిర్వహిస్తామని తెలిపారు.నిమజ్జనాలు నిర్వహించే ప్రాంతాలలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు .ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)