Atmakur: ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోండి!

Atmakur: ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల సిబ్బంది అక్టోబర్ 27-29 తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్‌లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని కమిషనర్ గంగాప్రసాద్ తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 26 Oct 2026 4:26 PM IST
Atmakur
X

Atmakur: ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోండి!

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికలు నవంబర్ 1న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ తెలిపారు. 28 వార్డులకు 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి నలుగురు, కౌన్సిలర్స్ గా 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్, రెవెన్యూ, టీచర్స్ ఇతర శాఖల సిబ్బంది అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పురపాలకసంఘం కార్యాలయలోని ఫెసి లిటేషన్ సెంటర్ నందు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)