Atmakur: ఆత్మకూరులో రైతుల నిరసన.. ఆక్రమణల కోరల్లో సాగునీటి కాలువలు!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సాగునీటి కాలువల ఆక్రమణపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

M Satya Peter, Atmakur
Published on: 28 April 2026 2:30 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో రైతుల నిరసన.. ఆక్రమణల కోరల్లో సాగునీటి కాలువలు!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మకూరు డివిజన్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో రైతులు వినతిపత్రం సమర్పించారు. ఆత్మకూరు చెరువు ఆయకట్టు పరిధిలోని వెంకట్రావుపల్లె, నర్సాపురం, నెల్లూరుపాలెం గ్రామాలకు సాగునీరు అందించే కాలువలు ఆక్రమణలకు గురయ్యాయని రైతులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్రసాద్,మాజీ కౌన్సిలర్ దగ్గుమాటి శివకోటారెడ్డి ఆధ్వర్యంలో రైతులు అర్జీ సమర్పించారు.

అలుగు వాగు నుంచి సాగునీరు అందించే సర్వే నంబర్ 904 కాలువకు అడ్డంగా మట్టి కట్ట వేయడంతో నీటి ప్రవాహంపూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. అదేవిధంగా సర్వే నంబర్లు 913, 920, 928లో ఉన్న కాలువలు రియల్ ఎస్టేట్ లేఅవుట్ల కారణంగా ఆక్రమించబడ్డాయని పేర్కొన్నారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించి కాలువలను యథాస్థితికి తీసుకురావాలని చెప్పినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

ప్రస్తుతం సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణలను వెంటనే తొలగించి,కాలువలను శుభ్రపరిచి పూర్వస్థితికి తీసుకురావాలని,బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరగన వెంకటేశ్వర్లు, పి.లక్ష్మీరెడ్డి, గోరి యస్ధాన్ తదితర రైతులతో పాటు బీఎస్పీ నాయకులు కృష్ణ పాల్గొన్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story