Atmakur: గురుకుల బాలికల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం!

Atmakur: ఆత్మకూరు గురుకుల బాలికల పాఠశాలలో ఉచిత ఆరోగ్య పరీక్షలు. విద్యార్థినులకు సీజనల్ వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించిన వైద్యులు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 3 Aug 2026 7:09 PM IST
Atmakur
X

Atmakur: గురుకుల బాలికల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం!

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని యూపీహెచ్‌సీ అరుంధతివాడ పరిధిలోని గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినుల కోసం ఉచిత ఆరోగ్య పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రసన్న హాజరై విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థినుల సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు జ్వరం, చర్మ సమస్యలు, రక్తహీనత, పోషకాహార లోపం తదితర అంశాలను పరిశీలించారు. అనారోగ్య సమస్యలు ఉన్న విద్యార్థినులకు తగిన మందులు పంపిణీ చేసి, అవసరమైన వైద్య సూచనలు అందజేశారు.

అనంతరం విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉండాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, గోర్లు కత్తిరించుకోవడం, పరిశుభ్రమైన దుస్తులు ధరించడం, వ్యక్తిగత వస్తువులు, ముఖ్యంగా దుస్తులు, తువ్వాళ్లు, దువ్వెనలు వంటి వాటిని ఇతరులతో పంచుకోకూడదని సూచించారు.

హాస్టల్‌లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకోవడం ద్వారా అనేక అంటువ్యాధులను నివారించవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్. సుధాకర్ గారు, హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి గారు టి శ్రీరాములు* గారు మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా మరియు ఇతర సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇంటి, పాఠశాల, హాస్టల్ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం, జ్వరం వచ్చిన వెంటనే స్వయంగా మందులు వాడకుండా సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు.

సీజనల్ వ్యాధులను ముందుగానే నివారించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రోజ్ గారు, స్టాఫ్ నర్స్ అన్నపూర్ణమ్మ గారు, ఏఎన్‌ఎం ఎస్.కే. సుభాని బేగం గారు, ఆశా కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story