Atmakur: ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన ఆందోళన.. అరెస్ట్‌లు
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద వైస్ చైర్మన్ పదవిపై జనసేన ఆందోళన; మంత్రి ఆనంపై నలిశెట్టి శ్రీధర్ ఆరోపణలు, నేతల అరెస్ట్.
Atmakur: ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన ఆందోళన.. అరెస్ట్‌లు
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద వైస్ చైర్మన్ పదవిపై తీవ్ర గందరగోళం నెలకొంది.11వ వార్డుకు చెందిన నలిశెట్టి శిరీషకు వైస్ చైర్మన్ పదవిని అధిష్టానం కేటాయించినట్లు జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ బీఫామ్ సైతం చూపించారు.
అయితే తనకు కాకుండా మంత్రి ఆనం సుమారు కోటి 50 లక్షల రూపాయలు తీసుకుని వేరొకరికి ఆ పదవిని కట్టబెడుతున్నారంటూ జనసేన సీనియర్ నాయకులు నలిశెట్టి శ్రీధర్ సంచలన ఆరోపణలు చేశారు.పదవిని డబ్బుకు అమ్ముకుంటున్నారని కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు అన్యాయం చేస్తున్నారని జనసేన నేతలు మండిపడ్డారు.
దీంతో జనసేన నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మంత్రి ఆనం తీరును జనసేన నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించకుండా, డబ్బులకు పదవులను అమ్ముకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. జనసేన నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ ఘటనతో ఆత్మకూరు రాజకీయాల్లో వైస్ చైర్మన్ పదవి వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది.




