Atmakur: మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ షకీలా రెడ్డి ముమ్మర పర్యటన!

Atmakur: ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా రెడ్డి 24వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి మాదాల శ్రీనివాసులుతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 22 Oct 2026 10:36 PM IST
Atmakur
X

Atmakur: మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ షకీలా రెడ్డి ముమ్మర పర్యటన!

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. నెటి సాయంత్రం 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాదాల శ్రీనివాసులు నాయుడుతో కలిసి డా. షకీలా రెడ్డి 24వ వార్డులో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ప్రతి ఇంటికి వెళ్లి తమను ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా తనకు, 24వ వార్డు అభ్యర్థిగా మాదాల శ్రీనివాసులు నాయుడికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంట్లోనూ మహిళలు డా. షకీలా రెడ్డికి బొట్టుపెట్టి, హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. మహిళా అభ్యర్థిగా తమకు అండగా నిలుస్తారనే నమ్మకంతో తమ పూర్తి మద్దతు తెలిపారు.

ప్రచారంలో భాగంగా డా. షకీలా రెడ్డి మాట్లాడుతూ వాస్తవానికి రాజకీయాలకు రావాలనే ఉద్దేశం నాకు లేదని కానీ తన మామ వివంగత ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి, తన భర్త దివంగత ఆత్మకూరు సర్పంచ్ రవీంద్రారెడ్డి పేరున ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలో ఉండేదాన్ని అయితే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో తన సొంత నిధులతోనే కాకుండా ప్రభుత్వ నిధులు కూడా కలిపి ఆత్మకూరుకు సేవ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పిన సూచన మేరకు రాజకీయాలకు వచ్చానని కావున తనను మంచి మెజారిటీతో గెలిపిస్తే ఆత్మకూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల సమస్యలను పరిష్కరించి, ఆత్మకూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.ఈ ప్రచార కార్యక్రమంలో 24వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)