Atmakur: ఆత్మకూరులో తారకనాథరెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా గెలుపును కాంక్షిస్తూ బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి పలు వార్డుల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు.
Atmakur: ఆత్మకూరులో తారకనాథరెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు!
ఆత్మకూరు: టిడిపి యువ కిరణం బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్నారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం ఆయా వార్డుల కౌన్సిలర్ల అభ్యర్థులతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
అశేష జనం ఆయనకు అఖండ స్వాగతం పలికి మంగళ హారతులు ఇస్తూ శాలువాలు పూలమాలలతో సన్మానాలు చేస్తూ స్వాగతం పలికి విశేషంగా ఆదరించారు.రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో తెలుగుదేశంలో చేరి వైద్య సేవలతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలు కూడా అందించాలన్న లక్ష్యంతో ఆత్మకూరు అభివృద్ధి ఏకైక అజెండాగా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా పోటీ చేస్తున్నారని ఆమెను అందరూ ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని తారకనాథరెడ్డి ఇంటింటికి వెళ్లి పట్టణ ప్రజలను కోరారు.
ఆయన ప్రచారంలో విశేష స్పందన లభించింది. అన్ని వర్గాల నుండి అశేష ప్రజాదరణ లభించింది. బొమ్మిరెడ్డి కుటుంబం అందించిన, అందిస్తున్న వైద్య సేవలు, సామాజిక సేవలు, ప్రజాసేవలను అందరూ గుర్తు చేసుకుంటూ ఆత్మకూరు మున్సిపాలిటీ అనూహ్యంగా అభివృద్ధి పరుస్తున్న ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బొమ్మిరెడ్డి షకీలా నాయకత్వంలో ఆత్మకూరు మున్సిపాలిటీ మరింతగా అభివృద్ధి చెందగలదని సర్వత్ర అభిప్రాయపడుతూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిలర్ల అభ్యర్థులు, తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు.




