Atmakur: ఆత్మకూరులో వేడెక్కిన మున్సిపల్ ఎన్నికల పోరు

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ 28 వార్డుల ఎన్డీఏ కూటమి అభ్యర్థుల జాబితాను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం విడుదల చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 17 Oct 2026 9:36 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో వేడెక్కిన మున్సిపల్ ఎన్నికల పోరు

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల పోరు వేడెక్కింది. 28 వార్డులకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల జాబితాను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం విడుదల చేశారు. ఆత్మకూరులోని రవితేజ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల హర్షధ్వానాల మధ్య అభ్యర్థులను ప్రకటించారు.

దీంతో కూటమి శ్రేణుల్లో ఎన్నికల ఉత్సాహం నెలకొంది.అభ్యర్థుల ప్రకటనతోపాటు నామినేషన్ల దాఖలుపైనా కూటమి నాయకత్వం దృష్టి సారించింది. అభ్యర్థులకు చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆత్మకూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు, సీనియర్ నాయకుల సహకారంతో నామినేషన్ పత్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 11 పత్రాలను పూర్తి చేసి అభ్యర్థులకు అందించినట్లు నాయకులు తెలిపారు.ఆత్మకూరు పట్టణ సమగ్ర అభివృద్ధినే ప్రధాన అజెండాగా తీసుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కూటమి నాయకులు తెలిపారు.

రహదారుల అభివృద్ధికి అదనంగా రూ.29 కోట్లు, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతానికి రూ.12 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సోమశిల నుంచి మరో పైపులైన్ ద్వారా తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు.150 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం, బీసీ బాలికల గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాల స్థాయికి అభివృద్ధి చేయడం, అర్హులకు ఇళ్ల పట్టాలు అందించడం వంటి హామీలను నాయకులు ప్రస్తావించారు.

పారిశుద్ధ్యం, వీధి దీపాలు, విద్యుత్, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు.28 వార్డులకు అభ్యర్థులను ప్రకటించడంతో ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు, పట్టణ అభివృద్ధి హామీలతో కూటమి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ సీనియర్ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ సీనియర్ సీనియర్ నాయకులు నలిశెట్టి శ్రీధర్, ఆత్మకూరు ఆత్మకూరు పట్టణాధ్యక్షులు టీడీపీ పట్టణాధ్యక్షులు తుమ్మల చంద్ర రెడ్డి, ఆనం తనయ ఆనం లీలా కైవల్య రెడ్డి, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు కుడుములు సుధాకర్ రెడ్డి, టిడిపి రాష్ట్ర మహిళా నాయకురాలు తు టిడిపి రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి సైలజ రెడ్డీ, పోటీ చేస్తున్న అభ్యర్థులు మాజీ కౌన్సిలర్లు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)