Atmakur: ఆత్మకూరు ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ జగదీశ్
Atmakur: ఆత్మకూరు ఆర్టీసీ డిపో, మున్సిపల్ బస్టాండ్‌ను తనిఖీ చేసిన నెల్లూరు ఈడీ జగదీశ్. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని సిబ్బందికి ఆదేశం.
Atmakur: ఆత్మకూరు ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ జగదీశ్
ఆత్మకూరు: నెల్లూరు ఈడీ జగదీశ్ ఆదివారం ఆత్మకూరు ఆర్టీసీ డిపోను తనిఖీ చేశారు. మున్సిపల్ బస్టాండ్, కార్గో డెలివరీ కేంద్రం, ఆర్టీసీ బస్టాండ్లను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బస్టాండ్లలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, ఆర్వో వాటర్, కుర్చీలు, ఫ్యాన్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ట్రాఫిక్ సెక్షన్, గ్యారేజీలో జరుగుతున్న పనులు, టైర్ సెక్షన్, క్యాష్ సెక్షన్లను పరిశీలించారు. డిపో నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఈ తనిఖీల్లో డిపో మేనేజర్ ఎం. శివకేష్ యాదవ్, అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్. రాజకుమార్, గ్యారేజ్ ఇన్చార్జి బాబూరావు, డిపో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.




