Atmakur: ఆత్మకూరులో 24 గంటల్లో దొంగతనం కేసు ఛేదన

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 24 గంటల్లో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. రూ. 12.85 లక్షల విలువైన నగలు, నగదు స్వాధీనం. అభినందించిన ఎస్పీ.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 16 Aug 2026 5:45 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో 24 గంటల్లో దొంగతనం కేసు ఛేదన

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఓ దొంగతనం కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఆత్మకూరు పట్టణంలోని జేఆర్ పేటలో నివసిస్తున్న వృద్ధ దంపతులకు సహాయకుడిగా ఆరు నెలల క్రితం పనిలో చేరిన విజ్ఞానపు వీర్రాజు తాను పనిచేస్తున్న ఇంట్లోనే 11 సవర్ల బంగారు నగలు,లక్షా 80 వేల 500 రూపాయల నగదును చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

చోరీ జరిగిన విషయం తెలుసుకున్న ఇంటి యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నిందితుడు వీర్రాజును అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు.

నిందితుడి సమాచారం మేరకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచిన 12 లక్షల 85000 ఇవ్వగలిగిన బంగారు నగలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ గంగాధర్, ఎస్సై జంపానీ కుమార్, ఐడీ పార్టీ కానిస్టేబుల్ కేశవ్ తదితరుల బృందం సమర్థవంతంగా దర్యాప్తు చేసి కేసును చేదించినట్లు సీఐ తెలిపారు.

అలాగే ఎవరైనా తమ ఇళ్లల్లో సహాయకులుగా చేర్చుకునే సమయంలో వారి చరిత్రను పూర్తి వివరాలను తెలుసుకోవాలని సూచించారు. కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందించనున్నట్లు ప్రకటించినట్లు సీఐ తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story