Sangam: నిరుపేదల స్థలాలపై అధికార పార్టీ నేతల కన్ను?
Sangam: నెల్లూరు జిల్లా సంగం మండలం జెండా దిబ్బలో ఇళ్ల స్థలాల కబ్జాపై బాధితులు ఆత్మకూరు ఆర్డీవో పావనికి ఫిర్యాదు చేశారు.
Sangam: నిరుపేదల స్థలాలపై అధికార పార్టీ నేతల కన్ను?
Sangam: నెల్లూరు జిల్లా సంగం మండలం జెండా దిబ్బ గ్రామంలో సర్వే నెం. 12/3లోని భూమిలో 2010లో లేఅవుట్ వేయగా సుమారు 59 మందిమీ కొనుగోలు చేశారు.. అయితే కరోనా సమయంలో ఆ ప్రాంతానికి ఇల్ల ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎవరు ఆ ప్రాంతానికి వెళ్లకపోవడంతో గ్రామంలోని పలువురు స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇతర ప్రాంతాలలో నివాసముంటున్న తమ బంధువులను కలుపుకొని కబ్జా చేశారన్నారు.
అప్పటినుండి పలుమార్లు సంగం తహసిల్దార్, మండల పరిధిలోని ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అందరము కూడా నిరుపేదలమని పైసా పైసా కూడబెట్టి భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తే అవి కబ్జాకు గురి గురి కావడంతో ఆందోళన చెందుతున్నారు.
గత నాలుగు సంవత్సరాల కాలం నుండి అధికారుల చుట్టూ మొరపెట్టుకున్న స్పందన కరువైందని నేడు ఆత్మకూరు ఆర్డీవో కు వినతి పత్రం అందించారు. స్పందించిన ఆర్డిఓ బి పావని వెంటనే సంఘం రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి స్వయంగా పరిశీలించి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.




