Kaluvaya: పల్లె వీక్షణ ఏర్పట్లను పరిశీలిస్తున్న ఆత్మకూరు ఆర్డీఓ పావని

Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో ‘పల్లె వీక్షణ’ కార్యక్రమానికి సర్వం సిద్ధం.

Madhav Goud, Nellore
Published on: 2 Jun 2026 3:32 PM IST
Kaluvaya
X

Kaluvaya: పల్లె వీక్షణ ఏర్పట్లను పరిశీలిస్తున్న ఆత్మకూరు ఆర్డీఓ పావని

కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో రేపు నిర్వహించనున్న పల్లె విక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆత్మకూరు ఆర్డీవో పావని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో పావని అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కార్యక్రమం విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అలాగే గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీసి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీవో శైలజ, మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు చల్లా రఘు రామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story