Atmakur: ఆత్మకూరు వాటర్ ప్లాంట్‌లో ఆర్‌డీఓ తనిఖీలు

Atmakur: ఆత్మకూరు పట్టణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో ఆర్‌డీఓ పావని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను తనిఖీ చేశారు.

M Satya Peter, Atmakur
Published on: 22 April 2026 12:02 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరు వాటర్ ప్లాంట్‌లో ఆర్‌డీఓ తనిఖీలు

Atmakur: ఆత్మకూరు పట్టణ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించి వారి ఆరోగ్య పరిరక్షణ చేయడమే తమ లక్ష్యమని ఆర్డిఓ పావని తెలిపారు. ఆత్మకూరు నీటి శుద్ధి ప్లాంట్ అధికారులుతో కలిసి ప్లాంట్ లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా ఆమె పరిశీలించారు.

ప్లాంట్ పనితీరు పరిశీలనతో పాటు ఎరేటర్ ఛాంబర్, నీటిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడం అనవసరమైన వాయువులను తొలగించే ప్రక్రియను గమనించారు. క్లారిఫ్లోక్యులేటర్ నీటిలోని మలినాలను గడ్డకట్టించి వేరు చేసే ప్రక్రియ సరిగ్గా జరుగుతుందో లేదో చూశారు. ఫిల్టేషన్ ప్లాంట్ వడపోత ప్రక్రియ,ఇసుక ఫిల్టర్ల స్థితిగతులను తనిఖీ చేశారు. కెమికల్ రూమ్ బ్లీచింగ్, ఆలంవంటి రసాయనాలనిల్వ, వాటిని కలిపే నిష్పత్తిని అడిగి తెలుసుకున్నారు.

తనిఖీ అనంతరం మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.సురక్షిత తాగునీరు ఆత్మకూరు ప్రజలందరికీ ఎటువంటి కలుషితం లేని స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణతో నీటి నాణ్యత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని,

క్లోరినేషన్ క్రమం తప్పకుండా చేయాలని స్పష్టం చేశారు.రికార్డుల నిర్వహణతో పాటు ప్రతిరోజూ నిర్వహించే పరీక్షల వివరాలను లాగ్ బుక్ లో నమోదు చేయాలని సూచించారు. వేసవి కాలం లేదా వర్షాకాలం వంటి సమయాల్లో నీటి ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, ఇలాంటి తనిఖీలు ప్రజల భద్రతకు ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ శుద్ధి అధికారులు పాల్గొన్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story