Atmakur: ఆత్మకూరులో శ్రీ సాంబశివ ట్రస్ట్ మానవతా సేవలు

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అంత్యక్రియల నిమిత్తం నాలుగు పేద కుటుంబాలకు రూ.40 వేల ఆర్థిక సాయం అందించిన శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 16 Aug 2026 6:47 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో శ్రీ సాంబశివ ట్రస్ట్ మానవతా సేవలు

ఆత్మకూరు: పేద కుటుంబాల కష్టకాలంలో అండగా నిలుస్తూ శ్రీ సాంబశివ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వరరెడ్డి సేవలు కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించేందుకు ఇబ్బందులు పడుతున్న నాలుగు కుటుంబాలకు తాజాగా రూ.40 వేల ఆర్థిక సాయం అందించారు.

ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున చెక్కుల రూపంలో సాయం అందజేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం ముస్లిం కాలనీకి చెందిన ఎస్‌కే ఖుర్షిద్‌ , కరటంపాడు ముస్లిం కాలనీకి చెందిన పఠాన్‌ బీర్‌జాన్‌ కుటుంబాలతోపాటు మున్సిపాలిటీ పరిధిలోని టీట్కో కాలనీకి చెందిన షేక్‌ సుల్తాన్‌ భాష, అరని ప్రకాష్‌ కుటుంబాలకు ఈ సాయం అందింది.

గత రెండేళ్లుగా పట్టణ ప్రాంతాలకే పరిమితమైన అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని ప్రస్తుతం ఆత్మకూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించినట్లు ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని ప్రాతిపదికగా తీసుకుని బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story