Atmakur: ఆత్మకూరులో స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల ఆత్మీయ సభ!

Atmakur: ఆత్మకూరులో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగస్తుల ఆత్మీయ సభ. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఎన్‌-జాక్ లక్ష్యమని ప్రతినిధులు వెల్లడి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 16 Aug 2026 12:48 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల ఆత్మీయ సభ!

Atmakur: ఆత్మకూరు మండలంలో, నెల్లూరు జిల్లా స్వర్ణ గ్రామ వార్డు ఉద్యోగస్తుల అసోసియేషన్ , నెల్లూరు జాయింట్ యాక్షన్ కమిటీ (NJAC) 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండల స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు ఉద్యోగస్తులతో ఆత్మీయ సభను ఆత్మకూరులో ఘనంగా నిర్వహించినారు.

ఈ కార్యక్రమంలో భాగంగా N-JAC టీమ్ సభ్యులు మాట్లాడుతూ స్వర్ణ గ్రామం -స్వర్ణ వార్డు ఉద్యోగస్తుల సమస్య పరిష్కారం లక్ష్యంగానే N-JAC పని చేస్తుందని తెలిపారు.మనమందరం ఐక్యంగా మన హక్కుల కోసం ముందుకు సాగాలని సూచిస్తూ ,జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో ఇదేవిధంగా ఆత్మీయ సభలు ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమానికి స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు ఉద్యోగులందరు సహకరించాలని కోరారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆత్మకూరు మండలంలోని స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఉద్యోగస్తులు మరియు N-JAC బృందం అయిన చైర్మన్ ఖాదర్ బాషా ,జనరల్ సెక్రెటరీ నెల్లూరు శ్రీనివాసులు రెడ్డి, వైస్ చైర్మన్ జై శ్రీ గారు, కో చైర్మన్ పాండురంగ గారు పబ్లిసిటీ సెక్రటరీ సహన్ గారు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story