Atmakur: 27వ వార్డులో నెరవేరిన కూటమి ఐక్యత - తారకనాథ్ రెడ్డి చొరవ!
Atmakur: ఆత్మకూరు 27వ వార్డు నెల్లూరుపాలెంలో బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి సమక్షంలో కూటమి ఐక్యత సమకూరింది. రెబల్ విత్డ్రా చేసి అభ్యర్థి విజగానికి మద్దతు ప్రకటన.
Atmakur: 27వ వార్డులో నెరవేరిన కూటమి ఐక్యత - తారకనాథ్ రెడ్డి చొరవ!
ఆత్మకూర్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు నెల్లూరు పాలెంలో కూటమి ఐక్యతను బలోపేతం చేసేందుకు బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి తారక మంత్రం ప్రయోగించారు.27వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెరుకూరు పద్మావతమ్మకు రెబల్ అభ్యర్థి చెరుకూరు స్రవంతి తిరుపతి నాయుడు మధ్య ఐక్యతను పెంపొందించే దిశగా రామాలయం వద్ద నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు చెరుకూరు శివప్రసాద్ నాయుడు, చెరుకూరు తిరుపతి నాయుడు సమక్షంలో బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఇరువురూ కలిసి పనిచేసి కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు.దీనిపై రెబల్ అభ్యర్థి చెరుకూరు స్రవంతి, తిరుపతి నాయుడు సానుకూలంగా స్పందిస్తూ కూటమి గెలుపుకు సహాయ సహకారాలు అందిస్తామని బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డికి హామీ ఇచ్చారు.
ఐక్యతతో పనిచేసే ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా రెడ్డి కి, వార్డ్ కౌన్సిలర్ల ప్రచారాలలో పాల్గొనేందుకు సానుకూలంగా స్పందించారు. వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా ఐక్యతతో ముందుకు సాగి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలనే లక్ష్యంతో జరిగిన ఈ ప్రయత్నం నెల్లూరు పాలెం 27వ వార్డులో రాజకీయ ప్రాధాన్యతను. సంతరించుకుంది. అనంతరం బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి చెరుకూరు పద్మావతమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో కలిశారు.




