Atmakur: సుల్తాన్ షహీద్ దర్గాకు చెందిన వక్ఫ్ స్థలాల్లో ఆక్రమణల గుర్తింపు

Atmakur: ఆత్మకూరు లో సుల్తాన్ షహీద్ దర్గా వక్ఫ్ భూములపై వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఖుదావన్ ఆధ్వర్యంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 22 July 2026 10:42 PM IST
Atmakur
X

Atmakur: సుల్తాన్ షహీద్ దర్గాకు చెందిన వక్ఫ్ స్థలాల్లో ఆక్రమణల గుర్తింపు

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ సయ్యద్ సుల్తాన్ షహీద్ దర్గా కి సంబంధించిన వక్ఫ్ భూములను జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఖుదావన్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. వక్ఫ్ బోర్డు సర్వేయర్ తోపాటు మున్సిపల్ సర్వేయర్, రెవెన్యూ శాఖ సర్వేర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు.

వక్ఫ్ బోర్డు స్థలాల అన్యాక్రాంతం నేపథ్యంలో గత కొంతకాలంగా వివాదం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో సోమశిల రోడ్డు సెంటర్లో గతవారం మున్సిపల్ అధికారులు పాత మరుగుదొడ్ల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు స్థలాన్ని చదును చేశారు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన ముస్లింలు అడ్డుకున్నారు. దీంతో వక్ఫ్ బోర్డు స్థలం ఎంత మేర ఉందో సర్వే చేసుకొని హద్దులు ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు.

మరోవైపు వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు సోమశిల రోడ్డు ప్రాంతం వెంబడి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ఆదేశించారు. దీంతో ఈ ప్రాంతంలో వక్ఫ్ బోర్టు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, సర్వేయర్లు సంయుక్తంగా సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఖుదావన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ ఆదేశాలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సుల్తాన్ షాహిద్ దర్గాకు సంబంధించిన 847 సర్వే నెంబర్లు 4 ఎకరాల 70 సెంట్లు, 848 సర్వే నెంబర్లు ఒక ఎకరా 40 సెంట్లు భూమిని సర్వే నిర్వహించామని తెలిపారు. ఈ రెండు సర్వే నెంబర్లలో కొంతమేర ఆక్రమణలకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

హద్దులు పూర్తయ్యాక ఈ పరిధిలో ఉన్న ఆక్రమణదారులకు చట్టరీత్యా నోటీసులు అందించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు తీవ్రస్థాయిలో అన్యాక్రాంతానికి గురైన 844 సర్వే నెంబర్లు మూడు ఎకరాల 70 సెంట్లు, 850 సర్వే నెంబర్లు 16 సెంట్లు, 852 సర్వే నెంబర్లలో రెండు ఎకరాల 35 సెంట్లు వక్ఫ్ స్థలం ఉందని తెలిపారు. ఈ మూడు సర్వే నెంబర్లలో హద్దులు ఏర్పాటు చేసుకునేందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిర్దేశించే సమయంలో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. వీటి ఆధారంగా ఆయా సర్వే నెంబర్లలో ఆక్రమణదారులకు నోటీసులు అందించి అధికారికంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story