Atmakur: ఆత్మకూరులో ముగిసిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు
Atmakur: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ ఆత్మకూరులో ముగిసిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్.
Atmakur: ఆత్మకూరులో ముగిసిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు
ఆత్మకూరు: ఎన్నికల సమయంలో మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పేద, మధ్యతరగతి వర్గాలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఆ హామీల అమలును విస్మరించి అన్ని వర్గాలను మోసం చేస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు శనివారం ముగిశాయి. తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు.చివరి రోజు ఆత్మకూరు టౌన్, రూరల్, మర్రిపాడుకు చెందిన వైఎస్సార్సీపీ యుజవన, విద్యార్థి విభాగ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు కూనం సుధాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి,రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి అంబటి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, మర్రిపాడు మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, గడ్డం శ్రీనివాసులరెడ్డి, షేక్ రహీం, ఏఎస్ పేట ఎంపీపీ బోయళ్ల పద్మజారెడ్డి, షేక్ పర్వీన్, ఆండ్రా రాజశేఖర్ రెడ్డి, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు జీ బాల అంకయ్య తదితరులు దీక్ష శిబిరంలో కూర్చన్న నాయకులకు పూలమాలలు వేసి దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు నందా ఓబులేసు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, పంచాయతీరాజ్ విభాగ కన్వీనర్ బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, మర్రిపాడు మండల యువత అధ్యక్షుడు చండ్రా నారాయణస్వామిలు మాట్లాడారు.
ఎన్నికల సమయంలో మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను పక్కన పెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కాపు నేస్తం సహా వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందించామని, స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించామని తెలిపారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలకు కోతలు విధించడం వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో కీలకమని, గతంలో ఈ పథకం ద్వారా విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా లభించేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో అందకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి, అర్హులైన ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని, పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలం గడిచినా వాస్తవంగా ఎన్ని కొత్త ఉద్యోగాలు కల్పించారో, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. యువతకు రాజకీయ ప్రకటనలు కాకుండా ఉద్యోగాలు కావాలని అన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షా ముప్పై వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు చేపట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన నియామకాలపై విమర్శలు చేయడం కాకుండా ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని అన్నారు.
డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కోసం కష్టపడి చదువుతున్న అభ్యర్థులు కుటుంబ బాధ్యతలను సైతం పక్కనపెట్టి పరీక్షలకు సిద్ధమయ్యారని, వారి భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడటం తగదని అన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో ఉన్న అనుమానాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని, అవకతవకలపై ఆరోపణలు ఉన్న చోట సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో రాజకీయ జోక్యానికి ఎలాంటి అవకాశం లేకుండా అర్హత, ప్రతిభ, మెరిట్ ఆధారంగానే నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశా…




