Atmakur: 22వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఇంటింటి ముమ్మర ప్రచారం!

Atmakur: ఆత్మకూరు 22వ వార్డులో వైఎస్సార్‌సీపీ ప్రచారం. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చైర్‌పర్సన్ అభ్యర్థి ఇందుమతి, కౌన్సిలర్ సుగుణమ్మలను గెలిపించాలని నాయకుల విజ్ఞప్తి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 25 Oct 2026 12:14 AM IST
Atmakur
X

Atmakur: 22వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఇంటింటి ముమ్మర ప్రచారం!

ఆత్మకూరు: స్థానిక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ పార్టీ తరుపున ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ సీనియర్ నాయకులు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి సతీమణి శ్రీమతి ఇందుమతి,22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కావాటి సుగుణమ్మ గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ 22వ వార్డులో ముమ్మరంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు ప్రజలు వైసిపి నాయకులకు సాదర స్వాగతం పలికి శాలువాతో చిరు సత్కారం చేశారు.వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, సీనియర్ నాయకులు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ప్రచారానికి పార్టీ నాయకులు యామరెడ్డి, కొండా వెంకటేశ్వర్లు, కొండా స్వరూపారాణి, తోడేటి మణి, సమీవుల్లా, వెంగయ్య, జనార్ధన్, జమీర్, బాల అంకయ్య, షరీఫ్, తిరుపతయ్య, నరేష్, సురేష్, వెంకటేశ్వర్లు, పద్మ, గంగమ్మ, లక్ష్మమ్మ, బుజ్జమ్మ, సుశీలమ్మ, మరియు పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)