Atmakur: మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల తీరు హేయం
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల తీరును ఖండించిన వైఎస్సార్సీపీ నేత ఇందుమతి రెడ్డి; చైర్పర్సన్కు అభినందన.
Atmakur: మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల తీరు హేయం
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులపై పోలిసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయం. సాటి మహిళలపై ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.మహిళా ప్రజాప్రతినిధులన్న గౌరవం కూడా లేకుండా వారిని పోలిసు వాహనాల్లో బలవంతంగా ఎక్కించుకుని ఊరంతా తిప్పడం సరైన పద్దతి కాదు, ఇలాంటి దుశ్చర్యలను ప్రతి మహిళా ఖండించాలి. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
ఇలాంటి హేయమైన చర్యలు చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, ప్రశ్నించిన వారిని ఇలా పోలిసులతో బెదిరింపులకు గురిచేయడం, ఇబ్బందులు పెట్టడం ఒక్క ఆనం గారికే సాధ్యం.ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు, మిత్ర పక్షం సీపీయం కౌన్సిలర్ కు, మున్సిపల్ చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా గారికి, మిగిలిన కౌన్సిలర్లకు హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.మా వైఎస్సార్సీపీ 10 మంది కౌన్సిలర్లు, నాయకులు కలిసి ఆత్మకూరు పట్టణ అభివృద్దిలో మా సహాయ సహకారాలు అందిస్తాము. అందరికి ధన్యవాదాలు.




