Atmakur: ఆత్మకూరు మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్లు శూన్యం!
Atmakur: ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికలలో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 50 మంది నామినేషన్ పత్రాలు తీసుకెళ్లగా, శనివారం నామినేషన్లు వేయనున్నారు.
Atmakur: ఆత్మకూరు మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్లు శూన్యం!
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో పాలకవర్గ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మంచి రోజు కాకపోవడంతో కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేయలేదని చెబుతుండగా, ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు కాకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.
కుల ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి పన్నుల రశీదులు సహా అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకున్న అభ్యర్థులు పార్టీ అధిష్ఠానం ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. పేర్లు ఖరారైన వెంటనే నామినేషన్లు దాఖలు చేస్తామని పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తెలిపారు.
ఈరోజు సుమారు 50 మంది వరకు మున్సిపల్ చైర్మన్ మరియు వార్డులలో పోటీ చేసేందుకు దాఖలు చేసేందుకు నామినేషన్ల పత్రాలు తీసుకెళ్లారు.. రేపు ఎల్లుండి రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో రేపు మంచి రోజు కావడంతో అత్యధిక శాతం నామినేషన్లు రేపే దాఖలు చేసే అవకాశం ఉంది.




