Atmakuru: ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఆదివారం కూడా ఎస్బీఐ సేవలు

Atmakuru: సమ్మె కారణంగా వరుస సెలవులు రాకుండా ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకు ఆదివారం కూడా పనిచేస్తుందని మేనేజర్ మహమ్మద్ మున్వర్ వెల్లడి. సేవలను వినియోగించుకోవాలని సూచన.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 26 Sept 2026 8:52 PM IST
Atmakuru
X

Atmakuru: ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఆదివారం కూడా ఎస్బీఐ సేవలు

ఆత్మకూరు: నాలుగవ శనివారము మరియు ఆదివారము సాధారణ సెలవులు సోమవారం నుండి మూడు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూసివేసి వినియోగదారులు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయం నిర్ణయంతో ఆత్మకూరులో ఆదివారం బ్యాంకు సేవలు యధావిధిగా కొనసాగుతాయని నెల్లూరు జిల్లా ఆత్మకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్. మున్వర్ తెలిపారు.

తమ బ్యాంకు ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తించి తమ బ్యాంకు లావాదేవీలను యధావిధిగా జరుపుకోవాలని తమ సిబ్బంది ఆదివారం సేవలు అందిస్తారని తెలిపారు.. ప్రజలకు ఇబ్బంది కలగకూడదని పై అధికారుల నిర్ణయంతో తాము కూడా ఆదివారమైన పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేసి విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)