Atmakuru: అంగరంగ వైభవంగా శ్రీ అలఘనాథ స్వామివారి కళ్యాణం
Atmakuru: ఆత్మకూరు శ్రీ అలఘనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహణ. ఉభయదాతలుగా వ్యవహరించిన కంచి పరమేశ్వర రెడ్డి దంపతులు.
Atmakuru: అంగరంగ వైభవంగా శ్రీ అలఘనాథ స్వామివారి కళ్యాణం
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అత్యంత ప్రాచీన చరిత్ర కలిగి, అనేక మహిమలకు నిలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలఘనాథ స్వామివారి దేవస్థానంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగింది.
దేవస్థానంలోని నూతన కళ్యాణ మండపంలో వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు ఈ కళ్యాణ తంత్రులను శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఆలయ ప్రాంగణమంతా భక్తుల నామస్మరణలు, భక్తి గీతాలాపనలతో మారుమోగిపోగా, స్వామివార్ల దివ్య మంగళ రూపాలను తిలకించిన భక్తజనం ఆధ్యాత్మిక ఆనందంలో తేలియాడారు.
సమాజ సేవకులు, నిత్యాన్నదాత, శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి - శ్రీమతి కంచి జయమ్మ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు.నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి సేవలో తరిస్తున్న కంచి పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది.
స్వామివార్ల దివ్య కళ్యాణాన్ని వీక్షించిన భక్తులందరూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలఘనాథ స్వామివారి కృపా కటాక్షాలను, దివ్యానుగ్రహాన్ని పొంది సంతోషించారు.ఈ కళ్యాణ మహోత్సవానికి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజన సమూహానికి శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారి సౌజన్యంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కంచి పరమేశ్వర రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి, ఈ దివ్య కళ్యాణ మహోత్సవానికి కుటుంబ సమేతంగా విచ్చేసి, స్వామివారి కళ్యాణాన్ని కళ్లారా తిలకించిన భక్తులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
స్వామివారి కృపకు పాత్రులై, తీర్థప్రసాదాలు మరియు అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరిపై ఆ దేవదేవుని దివ్య ఆశీస్సులు, అపార కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, మీ కుటుంబాలన్నీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.




