Atmakuru: ఆత్మకూరులో వక్ఫ్ బోర్డు స్థల వివాదం.. తీవ్ర వాగ్వాదం!

Atmakuru: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎల్‌ఆర్‌ పల్లిలో వక్ఫ్ బోర్డు స్థల వివాదం కలకలం. సర్వే నంబర్ 852 భూమిలో హద్దుల ఏర్పాటుపై వాగ్వాదం.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 31 July 2026 6:10 PM IST
Atmakuru
X

Atmakuru: ఆత్మకూరులో వక్ఫ్ బోర్డు స్థల వివాదం.. తీవ్ర వాగ్వాదం!

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎల్‌ఆర్‌ పల్లి ప్రధాన వీధిలో వక్ఫ్ బోర్డు స్థలానికి సంబంధించి వివాదం నెలకొంది. వక్ఫ్ బోర్డు స్థలంలో హద్దులు ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నించగా, స్థానిక వక్ఫ్ బోర్డు సిబ్బంది అడ్డుకున్నారు.

సంబంధిత వ్యక్తులు ఆ స్థలం తమ సొంతమని పేర్కొనగా, వక్ఫ్ బోర్డు సిబ్బంది మాత్రం అది సర్వే నంబర్ 852లోని వక్ఫ్ బోర్డు భూమిగా పేర్కొన్నారు. గతంలోనే ఈ విషయమై సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.స్థల వివాదంపై సమాచారం అందడంతో నెల్లూరు నుంచి వక్ఫ్ బోర్డు అధికారులు అక్కడికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులు, స్థల నిర్వాహకుల మధ్య కొంతసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితిని పరిశీలించిన జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ ఖుదావన్ మాట్లాడుతూ స్థలాలపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి,రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story