Nellore: భూసారాన్ని కాపాడుకుందాం.. ప్రకృతి వ్యవసాయం చేద్దాం
Nellore: కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన. జీవామృతం తయారీ మరియు పిఎండిఎస్ పంటల సాగుపై అధికారుల డెమో.
Nellore: భూసారాన్ని కాపాడుకుందాం.. ప్రకృతి వ్యవసాయం చేద్దాం
Nellore: నెల్లూరు జిల్లా, కలువాయి మండలం,ఉయ్యాల పల్లి గ్రామం నందు రైతు సాధికార సంస్థ (R Y S S) ద్వారా ఆంధ్రప్రదేశ్ సామూహిక ప్రకృతి వ్యవసాయం (A P C N F) మరియు వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, నాలి శ్రీనివాసులు,పామర్తి వెంకట నరసయ్య పొలం నందు పిఎండిఎస్ పంటలను మరియు కూరగాయల పంటల సాగును పరిశీలించారు,
ఈ సందర్బంగా మండల వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పంట పొలములను 365 రోజులు పంటలతో గాని పంట అవశేషాలతో గాని కప్పిఉంచడం ద్వారాఎల్నినో ఎఫెక్ట్ నుండి నేలను కాపాడుకోవచ్చునని తెలిపారు, ఘన జీవామృతం మరియు ద్రవ జీవామృతం తయారు చేయుటకు కావలసిన పదార్థాలను తయారుచేయు విధానాన్ని గురించి డెమో ద్వారా రైతులకు తయారు చేసే విధానాన్ని తెలియజేసారు,
విత్తన గుళికలను మరియు పిఎండిఎస్,కిట్లను తయారు చేసి రైతులకు విలువైన చూచనలు చేశారు,కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి డి రామకృష్ణ,గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు నాచురల్ ఫార్మింగ్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.




