Nellore: బారా షహీద్ దర్గా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అజితా వేజెండ్ల!

Nellore: నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ-2026 బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల స్వయంగా పరిశీలించారు.

V. Narasimhulu, Nellore
Published on: 24 Jun 2026 9:36 PM IST
Nellore
X

Nellore: బారా షహీద్ దర్గా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అజితా వేజెండ్ల!

నెల్లూరు: ఈనెల 26 నుంచి ఐదు రోజులపాటు జరిగే బారా షాహిద్ దర్గా ఫెస్టివల్ సందర్భంగా, లక్షలాదిమంది భక్తులు తరలి రానుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది... పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో....

బారా షహిద్ దర్గా రొట్టెల పండుగ–2026 బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల పరిశీలించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, అవుట్ పోస్టులు, ఘాట్ ప్రాంతాలను తనిఖీ చేశారు.

CCTV, డ్రోన్ సర్వేలెన్స్, LED డిస్‌ప్లేలు, RFID ట్యాగ్స్ ద్వారా భద్రతా పర్యవేక్షణను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, మిస్సింగ్ చిల్డ్రన్ ట్రాకింగ్, ఘాట్ ఏరియా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో రొట్టెల పండుగ విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story