Nellore: సెప్టెంబర్ 22 నుంచి బీసీ భవన్ పనులు: బీద రవిచంద్ర
Nellore: నెల్లూరులో సెప్టెంబర్ 22 నుంచి బీసీ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని టీడీపీ నేత బీద రవిచంద్ర తెలిపారు. కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి స్థల పరిశీలన చేశారు.
Nellore: సెప్టెంబర్ 22 నుంచి బీసీ భవన్ పనులు: బీద రవిచంద్ర
Nellore: బీసీ భవన్, అంబేద్కర్ భవన్, బాబూ జగ్జీవన్ రామ్ భవన్ లను జిల్లాకు మంజూరు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదని, బీసీ, ఎస్సీ సంఘ నేతల అభిప్రాయాలను పరిశీలనలోకి తీసుకుని బీసీ భవన్, అంబేద్కర్ భవన్, బాబు జగ్జీవన్ రామ్ భవన్ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు బీద రవిచంద్ర. 2017-19 మధ్యకాలంలో ఆనాటి టిడిపి ప్రభుత్వ హయాంలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్, బాబూ జగ్జీవన్ రావు భవన్ లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంజూరు చేశారని,
టీడీపీ ప్రభుత్వ హయాంలోబీసీ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం కాగా, అంబేద్కర్ భవన్, బాబూ జగ్జీవన్ రామ్ భవన్ నిర్మాణాలకు స్థల కేటాయింపు జరిగిందని చెప్పారు.
అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బీసీ భవన్, అంబేద్కర్ భవన్, జగ్జీవన్ రావు భవన్ నిర్మాణాలను పూర్తి చేయలేకపోయిందని అన్నారు...
బీసీ భవన్ నిర్మాణానికి మున్సిపల్ శాఖామాత్యులు పొంగూరు నారాయణ తమ విద్యాసంస్థల నుండి కోటి రూపాయల సిఎస్ఆర్ నిధులను అందించడం జరిగిందని.. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు కోటి రూపాయల నిధులను బీసీ భవన్ నిర్మాణానికి కేటాయించారని తెలిపారు..
బీసీ, అంబేద్కర్ భవన నిర్మాణాల కోసం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇంజనీర్లతో కలెక్టరు హిమాన్షు శుక్ల చర్చించారు.
బీసీ భవన్, అంబేద్కర్ భవన్ నిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన డ్రాయింగ్ లు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
బాబు జగ్జీవన్ రామ్ భవన్ నిర్మాణం కోసం కొత్తూరు ప్రాంతంలో కేటాయించిన స్థలంలో సమస్యలు ఉండడంతో బీసీ, అంబేద్కర్ భవనాల సమీపంలో స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.
మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పలు దఫాలు చర్చించాక, కలెక్టర్ తో కలిసి నిర్మాణ స్థలాలు నేడు పరిశీలించడం జరిగింది.




