Nellore: నెల్లూరుకు ఆర్.కృష్ణయ్య.. బీసీల్లో మొదలైన సందడి!

Nellore: ఈనెల 26న బీసీల ఆశాజ్యోతి ఆర్.కృష్ణయ్య నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నారు.

V. Narasimhulu, Nellore
Published on: 20 April 2026 3:17 PM IST
Nellore
X

Nellore: నెల్లూరుకు ఆర్.కృష్ణయ్య.. బీసీల్లో మొదలైన సందడి!

Nellore: ఈనెల 26న బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నెల్లూరు వస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నూకాలమ్మ జాతీయ ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకట జ్యోతి, సీనియర్ నేత దేవరాల సుబ్రహ్మణ్యం తెలియజేశారు .ఈ మేరకు వారు నెల్లూరు రాధే గెస్ట్ ఇన్ లో మీడియాతో మాట్లాడారు.

బీసీ లందరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీసీల హక్కుల కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ మీద కార్యక్రమం జరుగుతుందని పెద్ద సంఖ్యలో బీసీలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న బీసీ సంక్షేమ వ్యవస్థాపకుడు ఆర్ కృష్ణయ్య నెల్లూరు జిల్లాకు రావడం ఎంతో సంతోషమని వెల్లడించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story