Kaluvoya: బీసీలే టీడీపీకి వెన్నుముక: చైర్మన్ ధనుంజయ రెడ్డి
Kaluvoya: తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి పేర్కొంటూ కలువాయి మండలంలో అభ్యర్థి ఆరవ లిఖితతో కలిసి ప్రచారం చేశారు.
Kaluvoya: బీసీలే టీడీపీకి వెన్నుముక: చైర్మన్ ధనుంజయ రెడ్డి
Kaluvoya: తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి అన్నారు, నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి, మాదన్నగారిపల్లి, కుల్లూరు సెగ్మెంట్ లలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, అభ్యర్థి ఆరవ లిఖితతో కలిసి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివి అని ఈ రెండింటిని సమర్థవంతంగా మన ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు, నెలకు 4వేలు పెన్షన్ ఇచ్చి వృద్దులు, వితంతువులకు, వికలాంగులకు ఆండగా నిలిస్తుందన్నారు,
మాదన్నగారిపల్లి గతంలో ముంపు ప్రాంతం కింద ప్రకటించారని, పరిహారం రైతులకు అందలేదని, స్థానిక శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, దేవాదాయశాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి చొరవతో పరిహారం సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు నాయుడు, శివారెడ్డి, హాజరత్ నాయుడు,రాపూరు మార్కెటింగ్ వైస్ చైర్మన్ కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




