Chunchuluru: పాఠశాలలో ఉత్తమ విద్యార్థి అవార్డుల సందడి.. ఎన్నారై దాతృత్వం
Chunchuluru: చుంచులూరు ఉన్నత పాఠశాలలో ఉత్తమ విద్యార్థి అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
Chunchuluru: పాఠశాలలో ఉత్తమ విద్యార్థి అవార్డుల సందడి.. ఎన్నారై దాతృత్వం
Chunchuluru: చుంచులూరు ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ విద్యార్థి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చదువుతో పాటు క్రమశిక్షణ,మంచి విలువలు కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇంగ్లీషు ఉపాధ్యాయుడు పెంచలరావు కుమారుడు ప్రవాస భారతీయుడు లింగంగుంట రిహాన్ రావు దాతృత్వంతో ఈ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రాథమికొన్నత స్థాయిలో ఉత్తమ విద్యార్థిగా ఎంపికైన సురభిబోయిన శిరీషకు రూ.5000 నగదు బహుమతిని,
ప్రాథమిక స్థాయిలో ఉత్తమ విద్యార్థిగా ఎన్నికైన వనం ప్రజ్ఞకు రూ.1000 ప్రోత్సాహక బహుమతిని అందించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జొన్నా సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుతో పాటు మంచి ప్రవర్తన,
నైతిక విలువలను కూడా అలవర్చుకున్నప్పుడు మాత్రమే ఉన్నత స్థాయికి ఎదగగలరని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ భాస్కర్ మాట్లాడుతూ ఈ అవార్డులు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడమే కాకుండా, ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎం.సి చైర్మన్ రమణయ్య, ఉపాధ్యాయులు డి.వి.రమణయ్య,పెంచలరావు, బాలాజీ, మల్లికార్జున స్వామి, తిరుపాలు, రహిమ,కలిశెట్టి రాజేంద్ర కుమార్, సునీత, యలగాల శ్రీనివాసులు, రాఘవేంద్ర, ప్రసాద్, అవార్డు గ్రహీతల తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




