Atmakur: బీహార్ ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం - మంత్రి ఆనం!

Atmakur: బీహార్ బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా యాత్రికుల మృతిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విచారం.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 8 Jun 2026 12:31 PM IST
Atmakur
X

Atmakur: బీహార్ ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం - మంత్రి ఆనం!

ఆత్మకూరు: బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరు పట్టణానికి చెందిన ఒకరు మొత్తం ముగ్గురు భక్తులు మృతి చెందడం పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర దిగ్భ్రాంAtmakurతి, విచారం వ్యక్తం చేశారు.

ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని సంగం, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు ప్రాంతం నుంచి 43 మంది యాత్రికులతో గయా, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరిన ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని మంత్రి పేర్కొన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మంత్రి, ఈ దుర్ఘటన బాధిత కుటుంబాలకు తీరని లోటన్నారు.

ప్రమాదంలో గాయపడిన యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి, వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా అధికార యంత్రాంగం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

స్వస్థలాలకు దూరంగా జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర వేదనలో ఉన్నారని, వారి బాధను ప్రభుత్వం పంచుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించిన మంత్రి, వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

ప్రమాదానికి గురైన యాత్రికుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. బాధితులకు సహాయ సహకారాలు అందించడంలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించినట్లు మంత్రి పేర్కొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story