Nellore: పుణ్యక్షేత్రాల యాత్రలో విషాదం.. నెల్లూరు వాసుల మృతిపై మంత్రి నారాయణ ప్రగాఢ సంతాపం
Nellore: బీహార్ రోడ్డు ప్రమాదంలో నెల్లూరు యాత్రికుల మృతిపై మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విచారం.
Nellore: పుణ్యక్షేత్రాల యాత్రలో విషాదం.. నెల్లూరు వాసుల మృతిపై మంత్రి నారాయణ ప్రగాఢ సంతాపం
Nellore: నెల్లూరు యాత్రికుల దుర్మరణంపై కలత చెందారు మంత్రి నారాయణ.. బాధిత కుటుంబాలకు తక్షణ భరోసా ఇచ్చారు. ప్రమాద వార్తపై తక్షణమే స్పందించిన మంత్రి నారాయణ.. బీహార్ అధికారులతో అత్యవసర సంప్రదింపులు జరిపారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు...నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రికులు బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లి ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు ఆయన తన సానుభూతిని తెలియజేశారు.
ప్రమాద వార్త అందిన వెంటనే తీవ్రంగా స్పందించిన మంత్రి నారాయణ, బీహార్ మరియు రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు స్థానిక జిల్లా యంత్రాంగంతో అత్యవసరంగా మాట్లాడారు. నెల్లూరు జిల్లాకు చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.




