Kandaleru: కండలేరుకు కృష్ణా నికర జలాలు సాధించాలి బీజేపీ నేత మిడతల రమేష్

Kandaleru: అంతరాష్ట్ర ఒప్పందాల ప్రకారం కండలేరు డ్యామ్‌కు కృష్ణా నికర జలాలు రప్పించాలని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ డిమాండ్ చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 14 Oct 2026 3:31 PM IST
Kandaleru
X

Kandaleru: కండలేరుకు కృష్ణా నికర జలాలు సాధించాలి బీజేపీ నేత మిడతల రమేష్

Kandaleru: 1975లో చెన్నైకి త్రాగునీరు ఇవ్వడం కోసం అంతరాష్ట్ర ఒప్పందాలు జరిగాయని, కృష్ణా నికర జలాలను మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర ఒక్కొక్క రాష్ట్ర వాటా 5 టీఎంసీల చొప్పున కండలేరు డ్యామ్ కు విడుదల చేయాలి.

వాస్తవానికి నికర జలాలను ఎగువ రాష్ట్రాలు విడుదల చేయడం లేదని ఆరోపించారు... తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నైకు ఒప్పందాల ప్రకారం నీరు విడుదల చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

ఈ జల సంవత్సరంలో శ్రీశైలం నుండి సోమశిల కండలేరు డ్యామ్ లకు ఒక్క బొట్టు నీటి చుక్క కూడా విడుదల చేయలేదని చెప్పారు.. ప్రతి ఏడు ఉమ్మడి నెల్లూరు జిల్లా రైతుల హక్కులను హరిస్తూ చెన్నైకి కండలేరు నుండి మానవతా సాయంతో త్రాగునీరు అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకతో మాట్లాడి, కృష్ణా జలాలను కండలేరు డ్యామ్ కు రప్పించాలని కోరారు... ప్రత్యేకించి మహారాష్ట్రలో కృష్ణా జలాలు డ్యామ్ నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా అరేబియా సముద్రంలోకి 90 టీఎంసీల వరకు వదులుతున్నారని చెప్పారు...

పై రాష్ట్రాలతో మాట్లాడి నికర జలాలను కండలేరు డ్యామ్ కు రప్పించాలని బిజెపి డిమాండ్ చేస్తుందని చెప్పారు ... వెలిగొండ నల్లమల సాగర్ కు నీటిని తరలించడం కోసం చట్ట ప్రకారం కండలేరు డ్యామ్ కు రావలసిన నికర జలాలను రాబట్టుకోవడంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పారు...

నెల్లూరు జిల్లాలోని సోమశిల కండలేరు జలాశయాల్లో నీటి లభ్యత చాలా తక్కువగా ఉన్నందున నికర జలాలు రప్పించి ఆ నీటిని చెన్నైకి విడుదల చేయాలని రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి, సృజన, ఆదినారాయణ, రాపూరు, పొదలకూరు మండల అధ్యక్షులు పెంచలయ్య, ప్రశాంత్, వెంకటరత్నం నాయుడు, వాకా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE