Nellore: హౌసింగ్ శాఖలో రూ. 60 కోట్ల స్టీల్ కుంభకోణం?
Nellore: పేదల ఇళ్ల నిర్మాణంలో రూ. 60 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బిజెపి నేత మిడతల రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.
Nellore: హౌసింగ్ శాఖలో రూ. 60 కోట్ల స్టీల్ కుంభకోణం?
నెల్లూరు: పేదల పక్కా గృహాలలో స్టీల్ ను హౌసింగ్ అధికారులు కాంట్రాక్టర్ తో కలిసి తినేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు బిజెపి నేత మిడతల రమేష్. 60 కోట్ల మేర హౌసింగ్ ఇంజనీర్లు చేసిన కుంభకోణాన్ని నిరూపించలేక పోతే ప్రాణ త్యాగం చేస్తానని హౌసింగ్ జిల్లా కార్యాలయంలో ఈఈ జహీర్ కు బిజెపి నేత మిడతల రమేష్ రిప్రజెంటేషన్ సమర్పించారు. ప్రతి ఇంటికి బేస్మెంట్లో 342 కేజీలు స్టీల్ రాడ్లు వినియోగించాల్సి ఉండగా, కేవలం 200 కేజీలు మాత్రమే వినియోగించారు.
మూడో ఆప్షన్ కింద జిల్లాలో జరిగిన పనులలో 29 వేల గృహాలు లో 30 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. లబ్ధిదారుల పేర్లతో నిర్మించుకున్న గృహాలలో కూడా మరో 30 కోట్ల మేర స్టీల్ వినియోగంలో దుర్వినియోగం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంజనీర్ అవినీతిని నిరూపించేందుకు విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ గానీ, లా అండ్ ఆర్డర్ పోలీస్ గానీ, మెజిస్టీరియల్ విచారణ గాని, ప్రత్యేక సిట్ దర్యాప్తు గాని, ఏసీబీ గాని, ఏ దర్యాప్తు సంస్థను ప్రభుత్వం నియమిస్తే ఈ కుంభకోణాన్ని సాక్ష్యాలతో నిరూపిస్తామని, అలా నిరూపించలేని పక్షంలో స్పాట్లోనే ప్రాణత్యాగం చేస్తానని రమేష్ సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో సుజన, ఆదినారాయణ, సుబ్బయ్య, నారాయణ యాదవ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




