Nellore: నెల్లూరు పెన్నా నదిపై హై లెవెల్ బ్రిడ్జి పరిశీలన.

Nellore: నెల్లూరు పెన్నా నదిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొత్తగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు సందర్శించారు.

V. Narasimhulu, Nellore
Published on: 16 Jun 2026 4:24 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు పెన్నా నదిపై హై లెవెల్ బ్రిడ్జి పరిశీలన.

Nellore: ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిఎస్ పరశురామ్ ఆధ్వర్యంలో, మరియు పార్టీ నాయకులతో కలిసి, ప్రగతి పాదయాత్ర పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టును, సందర్శించాలనే ఉద్దేశంతో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా డి ఎస్ పరశురాం మాట్లాడుతూ..

నెల్లూరు నగరంలో పెన్నా నదిపైన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం 2025లో మొదలై, 2026లో పూర్తవడం చాలా సంతోషంగా ఉందని, ఎందుకంటే ఇంత పెద్ద బ్రిడ్జిని ఒక సంవత్సరం కాలంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఈ నెలాఖలకు తెస్తామని చెప్పి, కాంట్రాక్టర్లు చెప్పడం చాలా ఆనందంగా ఉందని, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బ్రిడ్జి కాంట్రాక్టర్ ను అభినందిస్తుందని అన్నారు.

అలాగే నేషనల్ హైవే గొలగమూడి క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని సందర్శించడం, అదేవిధంగా నేషనల్ హైవే బుజబుజ నెల్లూరు ఫ్లైఓవర్ బ్రిడ్జిని సందర్శించి, ఈ యొక్క నేషనల్ నెల్లూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి గొలగమూడి క్రాస్ రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కలిసి, 76 కోట్లతో గుత్తి దారులు దక్కించుకోవడం జరిగిందని, ఇవి ఇచ్చి 2024 నుంచి ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతుందని, ఈ రెండు బ్రిడ్జిలు కూడా ప్రజలకి ఆగస్టు నెలాఖరకు అందుబాటులోకి తెస్తామని, కాంట్రాక్టర్లు చెప్పడం జరిగిందని అన్నారు.

ఇక రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కూడా త్వరలో ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పడం జరిగిందని అన్నారు .ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు గోళ్ళ నరసింహులు, మరో ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కటకం మనోజ్, బిజెపి మండల అధ్యక్షుడు కోసూరు వెంకట సుధీర్, మండల ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి సురేష్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ మురారి మల్లికార్జున్, పొట్టి శివ,

ఎస్సీ మోర్చా ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు తిరుపతి, టిపి గూడూరు మండల అధ్యక్షుడు ప్రణయ్, ముత్తుకూరు మండల అధ్యక్షుడు కాకులూరు శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధి బ్రహ్మేంద్ర, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు ఎస్సీ మోర్చా జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ అశోక్ , జిల్లా ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు సలోమి ఇస్తిరమ్మ , జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story