Venkatachalam: వెంకటాచలం ఎంపీపీగా బీజేపీ నేత గుత్తల సుహాసిని ఏకగ్రీవం!

Venkatachalam: నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీపీగా బీజేపీ నేత గుత్తల సుహాసిని ఏకగ్రీవంగా, వైస్ ఎంపీపీగా టీడీపీ నేత వేమిరెడ్డి దేవి వైష్ణవి గురువారం ఎన్నికయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Nov 2026 9:49 PM IST
Venkatachalam
X

Venkatachalam: వెంకటాచలం ఎంపీపీగా బీజేపీ నేత గుత్తల సుహాసిని ఏకగ్రీవం!

నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్నికల అధికారి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.​ఈ ఎన్నికల్లో వెంకటాచలం మండల పరిషత్ నూతన అధ్యక్షురాలుగా (ఎంపీపీ) బీజేపీకి చెందిన గుత్తల సుహాసిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మండల పరిషత్ ఉపాధ్యక్షురాలుగా (వైస్ ఎంపీపీ) తెలుగుదేశం పార్టీకి చెందిన వేమిరెడ్డి దేవి వైష్ణవి ఎన్నికయ్యారు.

​ముందుగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులందరితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి, గుత్తల సుహాసిని, వేమిరెడ్డి దేవి వైష్ణవి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మహేశ్వర్ రెడ్డి అధికారికంగా నిర్ధారించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపిపి గుత్తల సుహాసిని మాట్లాడుతూ ఎంపీపీగా ఎన్నికవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అలాగే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కూటమి నాయకులు ఆశీస్సులతో ఈ మండల అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం చాలా సంతోషమని అన్నారు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్న ఎంపీటీసీలకు కోటమీ నాయకులకు నా తోటి కృషిచేసి నా ఎన్నికకు కష్టపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండలం కోటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్