Nellore: ప్రశాంతి నగర్ బీజేపీ ఆఫీస్ వివాదంపై బీజేపీ నేతల క్లారిటీ

Nellore: ప్రశాంతి నగర్ బీజేపీ కార్యాలయం పునర్నిర్మాణంపై మున్సిపల్ కమిషనర్‌తో వివాదం.

V. Narasimhulu, Nellore
Published on: 17 May 2026 11:12 AM IST
Nellore
X

Nellore: ప్రశాంతి నగర్ బీజేపీ ఆఫీస్ వివాదంపై బీజేపీ నేతల క్లారిటీ

నెల్లూరు: గత వారం రోజులుగా ప్రశాంతి నగర్ లో గతంలో కార్పొరేషన్ అధికారులు తొలగించిన బిజెపి కార్యాలయం పునర్నిర్మాణ విషయంలో బిజెపి నేతలకు మున్సిపల్ కమిషనర్ కు అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది... మా డ్యూటీ మేము చేశామని కమిషనర్ అంటుంటే... పార్టీల గురించి మతాల గురించి మీకెందుకు అంటూ బిజెపి నేతల కౌంటర్ ఇస్తున్నారు... ఈ నేపథ్యంలో బిజెపి నేతలు మరోసారి పార్టీ కార్యాలయం విషయమై క్లారిటీ ఇచ్చారు. ప్రశాంతి నగర్ లో నిర్మించిన బిజెపి కార్యాలయం ఎవరి పట్టా స్థలంలోనూ లేదని, కేవలం ఇరిగేషన్ పోరంబోకు స్థలంలోనే ఉందని బిజెపి యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుత్తా అశోక్ నాయుడు వెల్లడించారు... ప్రశాంతినగర్ లోని బిజెపి కార్యాలయం వద్ద ఆయన విలేఖరి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1996 నుంచి ఈ ప్రాంతంలో బిజెపి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ డివిజన్లో భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ కూడా గెలిచి ఈ డివిజన్ ప్రాతినిధ్యం వహించారని అప్పటినుంచి కార్యాలయం కొనసాగుతుందన్నారు... బిజెపి ఆఫీస్ పక్క ప్లాట్ వాళ్లు చెబుతున్నట్టుగా 356/ 1ఏ లో లేదని తమ పార్టీ కార్యాలయం ఉన్న స్థలం సర్వేనెంబర్ 356 /2/2/ లో ఉందని చెప్పారు.. 2022లో మైపాడు రోడ్డు విస్తరణలో భాగంగా తమ పార్టీ కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు తొలగిస్తే తాము గట్టిగా ఆందోళన చేసి కార్పొరేషన్ అధికారులను అడిగితే.

అప్పటి కమీషనర్ హరిత రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన తర్వాత పార్టీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చి మరవడంతో తాము ఇప్పుడు కంటైనర్లు ఏర్పాటు చేసుకుంటే దాన్ని అర్ధరాత్రి తొలగించడంతో తమ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కంటైనర్ తొలగించిన స్థానంలోనే పక్కా భవనాన్ని నిర్మించుకుందామని పేర్కొన్నారు.... ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు నరసింహులు నాయుడు , సత్యనారాయణ, శరవణ, గుర్రం వెంకటేశ్వరరావు, సాదా వెంకటేశ్వర్లు, పెద్దినేటి సీనయ్య, అరవ కుమార్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story